Saturday, April 13, 2013

బాల్కనీ లో ఓ పడక్కుర్చీ ....పార్కులో  బెంచి మీద జాగా ... రైల్లో కిటికీ పక్క సీటు ... ఇవన్నీ నాకెంతో అపురూపం ! ఇందులో ఏదైనా అనుభవించ గలిగే అవకాశం ఉన్నప్పుడు , నా కధలో నేనే ఎప్పుడో చెప్పి నట్లు ; ఆకాశం లోంచి ఓ ఉయ్యాల వెళ్లాడ దీసి చుక్కల మధ్య ఉగుతున్నట్లు అనుభూతి! ప్రపంచమంతా నా ముందు ఓ ఆట బొమ్మ! ఓ బాల్కనీ, ఓ పార్కు బెంచీ, ఓ కిటికీ సీటు ఇవన్నీ నన్ను నటి స్థానం నుంచీ ప్రేక్షకురాలి స్థానానికి తీసికెళ్తాయి. అసలు జీవితం లోనే స్టేజి మీద నుంచీ దిగిపోయి ప్రేక్షకుల స్థానం లో కూర్చుంటే ఎంత బాగుంటుందో! అందుకే ఇంట్లో లాగే జీవితం లోనూ ఓ బాల్కనీ వెతుక్కొంటూ ఉంటాను. 
ఉంటాను !
సెలవా మరి !
విజయ  

An easy chair in a balcony....a small bench in a park..window seat in a train....
All these things are precious to me! If ever I get a chance to enjoy any of these things ; I feel like swinging in a swing  hung from the sky and playing with the stars.
A balcony ...a park bench.. a window seat.. all these things shift me from a performer’s role to a spectator’s vantage point . Sometimes I think that how soothing it would be if  the shift were forever and permanent .That is the reason I seek refuge in my balcony to be a spectator to life’s many unfurlings during mornings, evenings and night .
Thanks for visiting my page .
Let us be connected always .
Vijaya